Advertisementt

మీడియాతో రాజమౌళి రచ్చ!

Tue 07th Jul 2015 11:00 PM
bahubali,rajamouli,shobu yarlagadda,media controversy  మీడియాతో రాజమౌళి రచ్చ!
మీడియాతో రాజమౌళి రచ్చ!
Advertisement
Ads by CJ

రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రం జూలై 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా పైరసీ కాకూడదని చిత్రబృందం తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని  ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించారు. ఈ సమావేశంలో మీడియా వారు అడిగిన కొన్ని ప్రశ్నలకు రాజమౌళి సమాధానం చెప్పకుండా దాటేసారు. గత మూడు రోజులుగా బాహుబలి సినిమాకు సంబంధించిన నటీనటులను ఇంటర్వ్యూ చేసే అవకాశం కొన్ని పేపర్లకు, చానళ్ళకు మాత్రమే ఇచ్చారు. మిగిలినవారి గురించి పట్టించుకోకుండా కేవలం రెండు, మూడు పేపర్లకు మాత్రమే అవకాశం ఇవ్వడంపై  మీడియా మిత్రులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇదేంటని ప్రశ్నించగా  రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ షెడ్యూల్స్ ప్రకారం ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తున్నామని చెప్పారు. మరి మిగిలిన పేపర్లకు, ఛానెల్స్ కు ఎప్పుడు నిర్వహిస్తారని ప్రశ్నించగా మాట దాటేసారు. మీడియాపై ఇలా వివక్షతను చూపిస్తుండడంతో సదరు మీడియా సోదరులు బాహుబలి చిత్ర బృందం పై ఆగ్రహంతో వెనుదిరిగారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ