Advertisementt

అమ్మో! మహేష్‌ది ఎంత పెద్ద కుటుంబమో?

Tue 07th Jul 2015 07:01 AM
mahesh babu,srikanth addala,brahmotsavam movie,mahesh babu family,krishna vamsi  అమ్మో! మహేష్‌ది ఎంత పెద్ద కుటుంబమో?
అమ్మో! మహేష్‌ది ఎంత పెద్ద కుటుంబమో?
Advertisement
Ads by CJ
>శ్రీకాంత్‌ అడ్డాల  తెరకెక్కించిన ‘సీతమ్మ వాకిట్లోసిరిమల్లె చెట్టు’ చిత్రం చూసిన వారికి శ్రీకాంత్‌ అడ్డాల  టేస్ట్‌ ఏమిటో తెలుస్తుంది. దర్శకుడు కృష్ణవంశీలానే శ్రీకాంత్‌ అడ్డాల  చిత్రాలు  కూడా ప్రతి ఫ్రేమ్‌లోనూ పది మందికి తగ్గకుండా ఆర్టిస్ట్‌లతో నిండి ఉంటాయి. ఎప్పుడు కళకళలాడే ఫ్రేమ్స్‌ సినిమాకు నిండుతనం తెస్తాయి. వాస్తవానికి శ్రీకాంత్‌ అడ్డాలలోని ఈ అంశమే మహేష్‌బాబుకు కూడా నచ్చి తొందరగానే రెండో చాన్స్‌ ఇచ్చాడు. కాగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా చేయనున్న ‘బ్రహ్మోత్సవం’కూడా చూసేందుకు ఇలాగే ఉంటుందిట. ఇందులో మహేష్‌కు ఆరుగురు అత్తలు, ముగ్గురు మరదళ్లు, బాబాయ్‌లు, మావయ్యలు, పిన్నిలు, పెదనాన్నలు, పెద్దమ్మలు కలిసి దాదాపు ఈ చిత్రంలో 50కిపైగా మెయిన్‌ ఆర్టిస్ట్‌లు ఉంటారని సమాచారం. ఇలాంటి ఓ ఉమ్మడి కుటుంబంలోని భావోద్వేగాలతో ‘బ్రహ్మోత్సవం’ రూపొందనుందని సమాచారం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ