>రజనీకాంత్ సింప్లిసిటీ, డెడికేషన్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కాగా ఆయన ప్రస్తుతం యువ దర్శకుడు రంజిత్ డైరెక్షన్‌లో చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీపొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. కాగా రంజిత్‌కు ప్రతి సినిమా ముందు క్యారెక్టర్ రిహాల్సర్స్ చేయడం అలవాటు. కథలోని కీలక పాత్రధారులతో వర్క్‌షాప్ నిర్వహిస్తాడు. గత రెండు చిత్రాలకు ఆయన ఇదే ఫాలో అయ్యాడు. రజనీకాంత్ సినిమాకు కూడా ఇదే తరహాలో రిహార్సల్స్‌పెట్టాడు. అయితే రజనీని పిలవడానికి సాహసించలేదు. విషయం తెలుసుకున్న రజనీ రిహార్సల్స్ జరుగుతున్న చోటుకి వెళ్లారు. రిహార్సల్స్ రూంలో రజనీని చూసి మిగతా యూనిట్ సభ్యులు షాకయ్యారు. సినిమాకు ముందు రిహార్సల్స్ చేయించడం మీ అలవాటు అని విన్నాను. మంచిది.. రండి... అందరం కలిసి చేద్దాం... అని రజనీ అనేసరికి షాకైపోవడం రంజిత్ వంతయింది. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు, విన్నప్పుడు దటీజ్..రజనీ అనిపిస్తుంది.