>ప్రస్తుతం పివిపి సినిమా నిర్మాణంలో వంశీపైడిపల్లి దర్శకత్వంలో నాగార్జున, కార్తీలతో ఓ మల్టీస్టారర్ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘దోస్త్’ అనే టైటిల్‌ను ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. తమన్నా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రం ఓ హాలీవుడ్ సినిమాకు స్ఫూర్తి అని తెలుస్తోంది. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టనుందని భావిస్తున్నారు. ఓ తమిళ యంగ్‌స్టార్ హీరో, ఓ తెలుగు సీనియర్ స్టార్‌హీరోలు కలిసి నటించనుండటం ఈ చిత్రానికి మెయిన్‌హైలైట్‌గా చెబుతున్నారు.