రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా వంటి భారీ తారాగణంతో రూపొంది, ఈనెల 10వ తేదీన బ్రహ్మాండంగా విడుదలకు సిద్దమవుతోన్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ‘బాహుబలి’. కాగా ఈ చిత్రానికి శాటిలైట్ రైట్స్ పరంగా కూడా బ్రహ్మాండమైన క్రేజ్ ఏర్పడిరది. ‘బాహుబలి’ శాటిలైట్‌ను 25కోట్లకు తక్కువగా అమ్మే ప్రసక్తే లేదని రాజమౌళి అండ్ కో పట్టుదలగా ఉంది. కానీ మా చానెల్ వారు 15 నుండి 16కోట్లకు మాత్రమే తీసుకుంటామని భీష్మించుకొని కూర్చున్నారట. అంత తక్కువ రేటుకు తమ చిత్రాన్ని అమ్మాల్సిన పనిలేదని భావించిన రాజమౌళి రేపు సినిమా విడుదలై బ్రహ్మాండమైన విజయం సాధిస్తే అప్పుడు 25కోట్లకు మించిన అమౌంట్‌ను చెల్లిస్తారని, కాబట్టి తొందరపడే పని మాత్రం వద్దని నిర్మాతలకు తెలిపాడట. అంటే దీన్ని బట్టి ‘బాహుబలి’పై రాజమౌళికి, ఆ టీంకు ఉన్న కాన్ఫిడెన్స్ అందరికీ అర్ధమవుతోంది.