Advertisementt

సాయి కొర్రపాటి నిజాయితీ!

Sat 04th Jul 2015 05:00 AM
bahubali,producer sai korrapati,bangalore rights,bahubali the beginning  సాయి కొర్రపాటి నిజాయితీ!
సాయి కొర్రపాటి నిజాయితీ!
Advertisement
Ads by CJ
>ప్రస్తుతం ఉన్న నిర్మాతల్లో సాయికొర్రపాటిది విలక్షణ వ్యక్తిత్వం. ఎగ్జిబిటర్‌, డిస్ట్రిబ్యూటర్‌ స్థాయి నుండి ‘ఈగ’ సినిమాతో నిర్మాతగా ఎదిగిన ఈయనకు రాజమౌళితో మంచి అనుబంధం ఉంది. కాగా ఆయన మీద ఉన్న నమ్మకంతో రాజమౌళి, ఆర్కా మీడియా వారు సాయికొర్రపాటికి ‘బాహుబలి’ సీడెడ్‌,  బెంగళూర్‌, కృష్ణా జిల్లాల హక్కులు ఇచ్చారు. అయితే ఆయనకు బెంగుళూరు ఏరియాకు సంబంధించి ఓ ఆఫర్‌ వచ్చింది. తాను కొనుక్కున్న రేటు కంటే 6కోట్లు అదనంగా ఇస్తామని, తమకు బెంగుళూరు రైట్స్‌ ఇమ్మని అడిగారట. అందుకు ఒప్పుకొన్న సాయి తనకు అదనంగా వచ్చిన 6కోట్లలో 3కోట్లను ఆర్కామీడియా వారికి అంటే ‘బాహుబలి’ నిర్మాతలకు షేర్‌ ఇచ్చినట్లు సమాచారం. నిర్మాతల వల్లే తనకు ఇంత ఆదాయం వచ్చింది కాబట్టి అందులో సగం నిర్మాతలకు చెందడమే సమంజసమని భావించి నిర్మాతలకు షేర్‌ ఇచ్చిన సాయి వ్యక్తిత్వాన్ని అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ