>టాలీవుడ్‌నే కాదు... బాలీవుడ్‌ను సైతం ఓ ఊపుఊపుతోన్న ‘బాహుబలి’ ట్రైలర్ చూసి రాజమౌళిని సినీ ప్రముఖులు ప్రశంసలు అందిస్తుండటంతో రాజమౌళి ఫోన్ ఇప్పుడు రోజంతా బిజీ అని వస్తోందిట. ఇప్పటికే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌బచ్చన్ ప్రశంసలను అందుకున్న రాజమౌళికి ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు ఫోన్ చేసి ఆయన గొప్పతనాన్ని పొగిడారట. దీంతో రాజమౌళి సినిమా విడుదలకు ముందే సగం విజయం సాధించాడని, జులై 10వ తేదీన రాజమౌళి అసలు సత్తా ఏమిటో అందరకి తెలుస్తుందని రాజమౌళి అభిమానులు ఆనందంగా ఉన్నారు.