Advertisementt

నిజంగా సునీత ఒప్పుకుందా..!?

Sat 04th Jul 2015 02:43 AM
singer sunitha,suneetha in pawan kalyan movie,pawan kalyan,sunitha singer,trivikram srinivas  నిజంగా సునీత ఒప్పుకుందా..!?
నిజంగా సునీత ఒప్పుకుందా..!?
Advertisement
Ads by CJ
>టాలీవుడ్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌ సునీత గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. అద్భుతమైన గానమాధుర్యంతో పాటు బ్యూటిఫుల్‌ లుక్స్‌ ఆమె సొంతం. ఆమెకు ఉన్న ఫ్యాన్స్‌ అంతాఇంతా కాదు. హీరోయిన్లకు కూడా అభిమానులు ఉంటారు గానీ అది తాత్కాలికం. కానీ సునీత విషయం అలా కాదు. ఆమెకు పర్మినెంట్‌ ఫ్యాన్స్‌ చాలా మంది ఉన్నారు. ఆమెను సినిమాల్లో నటింపజేయాలని గతంలో పలువురు దర్శకనిర్మాతలు ప్రయత్నించి విఫలమయ్యారు. అయినా ఆమె ఒప్పుకోలేదు. అయితే ఆమధ్య వచ్చిన శేఖర్‌కమ్ముల ‘అనామిక’ చిత్రం ప్రచారగీతంలో మాత్రం ఆమె తళుక్కున మెరిసింది.  ఇటీవల ఆమె మహేష్‌బాబుకు వదినగా నటించనుందనే వార్తలు వచ్చాయి. అయితే వాటిని ఆమె వెంటనే ఖండిరచింది. తాజాగా ఎట్టకేలకు సునీత వెండితెరపై కపినించేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం. త్వరలో ప్రారంభం అయ్యే పవన్‌కళ్యాణ్‌-త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ల సినిమాలో ఆమెను నటింపజేయాలని త్రివిక్రమ్‌ పట్టుదలతో సునీత కోసం తిరిగి ఎట్టకేలకు ఆమెను ఒప్పించాడని అంటున్నారు. అది కూడా పవన్‌కళ్యాణ్‌కు పిన్ని పాత్రలో అని సమాచారం.  ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో నదియాకు ఎంతటి ప్రాధాన్యం ఉందో.. అంతటి ప్రాధాన్యం ఉన్న పాత్రలో తనను చూపిస్తానని త్రివిక్రమ్‌ ప్రామిస్‌ చేయడంతో ఆమె అందుకు ఒప్పుకొందని తెలుస్తోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ