Advertisementt

సమాజానికి భయపడనంటున్న త్రిష!

Sat 04th Jul 2015 02:10 AM
trisha,trisha engagement,varun maniyan,trisha about her engagement,actress trisha  సమాజానికి భయపడనంటున్న త్రిష!
సమాజానికి భయపడనంటున్న త్రిష!
Advertisement
Ads by CJ
>హీరోయిన్‌ త్రిష-వరుణ్‌మనియన్‌ మధ్య ఏర్పడిన ప్రేమబంధం ఎంగేజ్‌మెంట్‌ వరకు వెళ్లినప్పటికీ ఆ తర్వాత అది బ్రేకప్‌ కావడంతో ఇద్దరూ విడిపోయారు. ఇటీవల ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో త్రిష మాట్లాడుతూ...బ్రేకప్‌ తర్వాత తన జీవితం, భవిష్యత్తు ప్లాన్స్‌ గురించి చెప్పుకొచ్చింది. ఈ విషయాలపై త్రిష స్పందిస్తూ.... బ్రేకప్‌ తర్వాత నేనేమీ బాధపడటం లేదు. చాలా సంతోషంగా ఉన్నాను. ప్రస్తుతం కెరీర్‌ మీదనే దృష్టి పెట్టాను. జీవితంలో చేయాల్సినవి చాలా ఉన్నాయి. 32ఏళ్ల వయసు వచ్చినా ఇంకా పెళ్లికాలేదు... అనే విమర్శలను నేను పట్టించుకోను. వివాహ వ్యవస్థపై నాకు నమ్మకం ఉంది. త్వరలోనే మంచి వ్యక్తిని ప్రేమించి, పెళ్లి చేసుకుంటాను. సమాజానికి భయపడి ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవడానికి నేను సిద్దంగా లేను. నాకు నచ్చిన వ్యక్తి దొరికినప్పుడే పెళ్లి చేసుకుంటాను. అప్పటివరకు వెయిట్‌ చేస్తాను.. అని స్పష్టం చేసింది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ