Advertisementt

తనపై తానే సెటైర్లు వేసుకొన్న సమంత!

Thu 02nd Jul 2015 03:01 AM
samantha,tollywood heroine,samantha school days,ye maya chesave,satires  తనపై తానే సెటైర్లు వేసుకొన్న సమంత!
తనపై తానే సెటైర్లు వేసుకొన్న సమంత!
Advertisement
Ads by CJ
>సమంత తెలుగు ప్రేక్షకులను తొలిచూపులోనే మాయచేసేసింది. ‘ఏ మాయ చేసావే’ చిత్రంలో ఆమెను చూసిన ప్రేక్షకులు, దర్శకనిర్మాతలు, స్టార్‌హీరోలు కూడా ఆమె మాయలో పడిపోయారు. దీంతో ఓవర్‌నైట్‌ ఆమె టాప్‌ స్టార్‌ అయిపోయింది. అందరూ ఆమె నామజపమే చేస్తూ ఉండిపోయారు. మరి ఆమె విజయానికి కారణం అందమా? అభినయమా? అదృష్టమా? అనే ప్రశ్నలను సమంతను అడిగితే ఆమె సమాధానం ఇస్తూ... నేనేం అందగత్తెను కాదు... స్కూల్‌, కాలేజీ రోజుల్లో నన్నేవరు పట్టించుకునే వారు కాదు. నా అందంపై నాకే అనుమానాలు ఉండేవి. సినిమాల్లోకి వచ్చాక నాకు కాస్ట్యూమ్స్‌, నా మేకప్‌మేన్‌ వల్లే అందంగా కనిపిస్తున్నాను. నా స్టార్‌డమ్‌కి కారణం నా అదృష్టమే.. అంటూ తనపై తానే సెటైర్లు వేసుకొంది. సమంతను తమ ఆరాధ్య దేవతగా కొలుస్తున్న అబ్బాయిలంతా ఈ మాటలతో ఏకీభవిస్తారా? అనేది సందేహమే. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ