Advertisementt

నాగచైతన్య తప్పు చేశాడా?

Wed 01st Jul 2015 09:31 PM
naga chaitanya,krishnamma kalipindi iddarini,sudheer babu,lagadapati sridhar,dohchai  నాగచైతన్య తప్పు చేశాడా?
నాగచైతన్య తప్పు చేశాడా?
Advertisement
Ads by CJ
>ఇటీవలే విడుదలైన సుధీరబాబు తాజా చిత్రం ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ చిత్రానికి మంచి టాక్‌ వచ్చింది. అయితే ఈ చిత్రంలో సుధీర్‌బాబు కాకుండా కొద్ది పేరున్న క్లాస్‌ హీరోను తీసుకొని ఉంటే సినిమా రేంజ్‌ ఎక్కడికో వెళ్లిపోయేదని అంటున్నారు. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్‌ కోసం నిర్మాత లడగపాటి శ్రీధర్‌`శిరీషాలు మొదట నాగచైతన్యను కలిశారు. కానీ ఎందువల్లో కానీ ఈ చిత్రం చేయడానికి ఆయన నో చెప్పాడు. ఈ చిత్రానికి నో చెప్పిన ఆయన తన దృష్టిని మొత్తాన్ని ‘దోచెయ్‌’ పైనే పెట్టాడు. ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ చిత్రంలో కనీసం నాగచైతన్య నటించినా కూడా ఈ చిత్రానికి మంచి కలెక్షన్లు వచ్చేవని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఉదంతం చూస్తే స్క్రిప్ట్‌ల ఎంపికలో చైతూలో పరిణతి రాలేదని, అందునా ఓ రీమేక్‌ సినిమాను చూసి కూడా అది తనకు సూట్‌ అవుతుందా? లేదా? అనే నిర్ణయానికి ఆయన రాలేకపోవడం ఇందుకు ఉదాహరణగా  చెప్పవచ్చు అంటున్నాయి ఫిల్మ్‌నగర్‌ వర్గాలు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ