Advertisementt

పూరీ అంటే అంతే మరి!

Wed 01st Jul 2015 09:11 PM
puri jagannadh,naga babu,varun tej,mukunda,mega star  పూరీ అంటే అంతే మరి!
పూరీ అంటే అంతే మరి!
Advertisement
Ads by CJ
>టాలీవుడ్‌లో మాస్‌ డైరెక్టర్స్‌గా వినాయక్‌, బోయపాటి, శ్రీనువైట్ల తదితరులు ఉన్నప్పటికీ పూరీజగన్నాథ్‌ స్టైల్‌ మాత్రం డిఫరెంట్‌. ఆయన అనుకుంటే మెగాస్టార్‌తో చిత్రం తీయగలడు. వెంటనే సంపూర్ణేష్‌తోనూ తీయగలడు. అదే పూరీ స్పెషాలిటీ. కాగా త్వరలో ఆయన మెగాహీరో వరుణ్‌తేజ్‌తో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి పూరీ తప్ప మరో ఆప్షన్‌ లేకపోవడంతోనే మెగాబ్రదర్‌ నాగబాబు ఈ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడట. వాస్తవానికి మెగాహీరోలు అంటే మాస్‌ అండ్‌ యాక్షన్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉంటారు. కానీ వరుణ్‌తేజ్‌ మొదటి సినిమా ‘ముకుంద’ క్లాస్‌ మూవీ. ఇక ప్రస్తుతం క్రిష్‌ దర్శకత్వంలో నటిస్తున్న ‘కంచె’ కూడా అదే కోవలోని సినిమా అనేది ఖాయం. దీంతో తమ కుమారుడిని పూరీ అయితేనే కరెక్ట్‌గా మాస్‌ హీరోగా ఎస్టాబ్లిష్‌ చేస్తూ, అనుకున్న బడ్జెట్‌లో తీయగలడనే నమ్మకమే నాగబాబును ఒప్పించింది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ