Advertisementt

కమల్‌ని వెంటాడుతున్న కష్టాలు.!

Wed 01st Jul 2015 05:15 AM
kamal haasan new movie papanasham,kamal haasan new movie viswaroopam 2  కమల్‌ని వెంటాడుతున్న కష్టాలు.!
కమల్‌ని వెంటాడుతున్న కష్టాలు.!
Advertisement
Ads by CJ

ఈమధ్య కమల్‌హాసన్‌ చేసిన ప్రతి సినిమానీ ఏదో ఒక రూపంలో కష్టాలు వెంటాడుతున్నాయి. ఆమధ్య విశ్వరూపం రిలీజ్‌ విషయంలో ఎన్నో కష్టాలు, మరెన్నో ప్రాబ్లమ్స్‌ని ఫేస్‌ చేసిన కమల్‌ ఆ తర్వాత ఉత్తమ విలన్‌ రిలీజ్‌ విషయంలోనూ సమస్యలను ఎదుర్కొన్నాడు. లేటెస్ట్‌గా దృశ్యం తమిళ రీమేక్‌ పాపనాశం చిత్రానికి కూడా రిలీజ్‌ విషయంలో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా ఆ సమస్యల నుంచి బయటపడ్డాడు కమల్‌. ఈ సినిమా రిలీజ్‌కి మార్గం సుగమం చేసుకున్నాడు. ఇదిలా వుంటే కమల్‌హాసన్‌కి ఎంతో ఇష్టమైన విశ్వరూపం చిత్రానికి సీక్వెల్‌గా చేస్తున్న విశ్వరూపం2 రిలీజ్‌కి కూడా కష్టాలు పొంచి వున్నాయి. సినిమా కంప్లీట్‌ అయి చాలా కాలం అవుతున్నా ఈ సినిమా రిలీజ్‌కి నోచుకోలేదు. పాపనాశం తర్వాత విశ్వరూపం 2 చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి కమల్‌హాసన్‌ విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. అది ఎంతవరకు సక్సెస్‌ అవుతుందో, ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో కమల్‌కి కూడా తెలియదు. కాబట్టి మనం వెయిట్‌ చెయ్యక తప్పదు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ