Advertisementt

‘బాహుబలి’ని పట్టించుకోని మహేష్‌...!

Tue 30th Jun 2015 02:03 PM
mahesh babu,sreemanthudu,bahubali,rajamouli,brahmothsawam  ‘బాహుబలి’ని పట్టించుకోని మహేష్‌...!
‘బాహుబలి’ని పట్టించుకోని మహేష్‌...!
Advertisement
Ads by CJ

జులై 10వ తేదీన రాజమౌళి, ప్రభాస్‌ల ‘బాహుబలి’ చిత్రం దేశవ్యాప్తంగా నాలుగు భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. ఆ రోజంతా ‘బాహుబలి’ టాక్‌ ఏమిటి? కలెక్షన్లు ఎలా ఉన్నాయి? మొత్తం ఎంత కలెక్ట్‌ చేయవచ్చు? వంటి వార్తలే ఇండస్ట్రీలోనే కాదు... సామాన్య ప్రేక్షకుల్లో కూడా చర్చకు రానున్నాయి. అయితే ఈ గొడవలేమీ నాకెందు అనుకున్నాడో ఏమో.. మహేష్‌బాబు మాత్రం ఆ రోజు బిజీబిజీగా గడపనున్నాడు. ఆ రోజున మహేష్‌బాబు, శ్రీకాంత్‌ అడ్డాల, పివిపి సంస్థల కాంబినేషన్‌లో రూపాందనున్న ‘బ్రహ్మోత్సవం’ ఆరంభం కానుంది. ‘బాహుబలి’ గురించి పట్టించుకోకుండా మహేష్‌ మాత్రం తన పనిలో తాను నిమగ్నమైపోనున్నాడు. ఈ చిత్రాన్ని 2016 సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ