మెగాస్టార్ చిరంజీవి నటించే 150వ చిత్రం పేరు ‘ఆటోజానీ’ కాదని చిరంజీవి యువత అధ్యక్షుడు స్వామినాయుడు తెలిపారు. దీంతో చిరు 150వ చిత్రంపై మరలా అనుమానాలు మొదలయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం కోసం పూరీ ‘ఆటోజానీ’ అనే టైటిల్‌ను రిజిష్టర్ చేయించాడు. ఈ టైటిల్ చిరంజీవికే కాకుండా, రామ్‌చరణ్‌కు కూడా బాగా నచ్చినట్లు వార్తలు వచ్చాయి. పూరీకి చిరు చిత్రానికి అవకాశం రావడంలో టైటిల్ కూడా కీలకపాత్ర పోషించింది. కానీ ఇప్పుడు ఆ టైటిల్ చిరంజీవి కోసం కాకపోతే మరి దేనికి? అనే ప్రశ్న ఉదయిస్తోంది. దీంతో చిరు తన 150వ చిత్రానికి పూరీని కాకుండా వినాయక్‌ను పెట్టుకుంటున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చిరు వినాయక్‌ల మధ్య ఇటీవల జరిగిన చర్చలు వాస్తవమే అని తెలిసిన పూరీ ఈ విషయంపై చిరును అడగ్గా.. అది తన 151వ చిత్రం కోసం అని బదులిచ్చాడట. ఏదిఏమైనా ఒక్క విషయం మాత్రం నిజమని తెలుస్తోంది. చిరు బర్త్‌డే అయిన ఆగష్టు 22 నాటికి పూరీ, వినాయక్‌లలో ఎవరు పక్కా స్క్రిప్ట్‌తో వస్తే వారికే చిరు 150వ చిత్రం ఖాయమని ఫిల్మ్‌నగర్ సమాచారం.