Advertisementt

‘జర్నీ’ తర్వాత ‘ఛాలెంజ్‌’..!

Tue 30th Jun 2015 03:10 AM
valiyan movie,challenge movie,journey team,saravanan  ‘జర్నీ’ తర్వాత ‘ఛాలెంజ్‌’..!
‘జర్నీ’ తర్వాత ‘ఛాలెంజ్‌’..!
Advertisement
Ads by CJ

ఈ సమ్మర్‌లో ‘వలియవన్‌’ పేరుతో తమిళనాట విడుదలై ఘనవిజయం సాధించి మంచి కలెక్షన్లు కొల్లగొడుతున్న చిత్రాన్ని తెలుగులో ‘చాలెంజ్‌’ పేరుతో విడుదలకు సిద్దం చేస్తున్నారు,. ‘జర్నీ’ సినిమా సక్సెస్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో జై ఇందులో హీరోగా నటిస్తుండగా, ‘జర్నీ’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ఎమ్‌.శరవణన్‌ ఈ చిత్రాన్ని కూడా తెరకెక్కించాడు. ఇలా ‘జర్నీ’ టీమ్‌ కలిసి మరోసారి రూపొందించిన ఈ చిత్రం హక్కుల కోసం చాలామంది నిర్మాతలు పోటీపడినప్పటికీ జై మారుతి పిక్చర్స్‌ బేనర్‌పై గోపీచంద్‌ పండగ ఈ హక్కులను చేజిక్కించుకొని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ఇమాన్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలో హీరోయిన్‌ అండ్రియా జైకు  జోడీగా నటించింది. మరి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని ఎంతవరకు సాధిస్తుందో వేచిచూడాల్సివుంది..! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ