నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 99వ చిత్రం ‘డిక్టేటర్’. ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో అంజలి, ప్రణీతలను హీరోయిన్లుగా ఫైనల్ చేశారు. ఇందులో ప్రణీత సెకండ్ హీరోయిన్‌గా నటించాల్సివుంది. అయితే ఇప్పుడు హఠాత్తుగా ప్రణీత ఈ చిత్రానికి తనకు డేట్స్ అడ్జస్ట్ కావడం లేదంటూ ఇందులో నుండి బయటకు వచ్చేసింది. చెప్పడానికి డేట్స్ ప్రాబ్లమ్ అని చెబుతున్నప్పటికీ బాలయ్య పక్కన అందునా సెకండ్ హీరోయిన్‌గా నటిస్తే తన కెరీర్‌కు ప్రమాదమని ఆమె భావిస్తోందని అందుకే డేట్స్ ప్రాబ్లమ్ అని చెబుతోందని టాక్. అయితే మహేష్‌బాబు నటించే ‘బ్రహ్మోత్సవం’లో మాత్రం మహేష్ పక్కన సెకండ్ హీరోయిన్‌గా చేస్తున్నందుకు ఆమె సంతోషాన్ని వ్యక్తం చేస్తోందని సమాచారం. మొత్తానికి ఈ కన్నడ హీరోయిన్ బాగా నేర్పరి అని చెప్పవచ్చు.