Advertisementt

వందకోట్ల క్లబ్‌లో రెండో సినిమా..!!

Sat 27th Jun 2015 08:31 AM
abcd2,prabhudeva,100 crores,remo dsouza  వందకోట్ల క్లబ్‌లో రెండో సినిమా..!!
వందకోట్ల క్లబ్‌లో రెండో సినిమా..!!
Advertisement
Ads by CJ

బాలీవుడ్‌లో సినిమాలు వంద కోట్ల వసూలు సాధించడం ఈమధ్య చాలా సర్వసాధారణ విషయంగా మారింది. అయితే 2015 సంవత్సరానికి వచ్చే సరికి మాత్రం జూన్‌ వరకు కూడా ఏ ఒక్క సినిమా వంద కోట్ల క్లబ్‌లో చేరలేదు. ఐదు నెలల విరామం అనంతరం కంగనారౌనత్‌ నటించిన 'తను వెడ్స్‌ మనూ' చిత్రం వంద కోట్ల క్లబ్‌లో చేరి బాలీవుడ్‌ వర్గాలకు ఊరటనిచ్చింది. ఆ తర్వాత ఆ క్లబ్‌లో కొన్ని రోజుల వ్యవధిలోనే మరో సినిమా వచ్చి చేరడంతో బాలీవుడ్‌ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

ఎనీ బడి కెన్‌ డ్యాన్స్‌ అంటూ డ్యాన్స్‌ ప్రధాన ఇతివృత్తంగా బాలీవుడ్‌లో 'ఏబీసీడీ' సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదలైన 'ఏబీసీడీ-2'కు కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకుంది. ఈ నెల 19న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా వందకోట్ల గ్రాస్‌ను కలెక్ట్‌ చేసింది. ఇండియాలో దాదాపు 93 కోట్లు, ఓవర్సీస్‌లో ఈ సినిమా 11కోట్లకు పైగానే వసూలు చేసి వంద కోట్ల క్లబ్‌లో చేరింది. ప్రభుదేవా కూడా ఈ సినిమాలో ఓ ముఖ్యపాత్రలో కనిపించడం గమనార్హం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ