దేశం గర్వించదగ్గ కథానాయకుల్లో నాగేశ్వర్‌రావు ఒకరు. ఆరుదశాబ్దాలకుపైగా తెలుగు చిత్ర సీమలో ఓ వెలుగు వెలిగిన ఏఎన్‌ఆర్ తన చివరి శ్వాస వరకు సినిమానే ధ్యాసగా బతికారు. అందుకే తాను చనిపోతానని తెలిసి కూడా 'మనం'లాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను శ్రీయ ఓ ఆంగ్ల దినపత్రికతో పంచుకుంది.
మరికొన్ని రోజుల్లో చనిపోతానని తెలిసి కూడా 'మనం' షూటింగ్ కోసం ఏఎన్‌ఆర్ ఎంతో కష్టపడ్డారని శ్రీయ చెప్పుకొచ్చారు. కొన్నిసార్లు షూటింగ్ లోకేషన్లలో కొన్నిసార్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారని, ఇవన్నీ చూసి తాము ఆందోళన చెందితే ధైర్యం చెప్పేవారని తెలిపారు. తాను ఎక్కడో ఆస్పత్రిలో కన్నుమూసేదానికంటే ఇలా కెమెరా ముందే చనిపోతే ఇంకా హ్యాపీగా ఫీలవుతానంటూ ఏఎన్‌ఆర్ పేర్కొనేవారన్నారు. ఇక ఏఎన్‌ఆర్ పడుతున్న బాధలను చూసి తీవ్ర ఉద్వేగానికిలోనైన నాగార్జున ఓసారి తనతో ఏదైన గన్ ఉంటూ ఇవ్వు.. షూట్ చేసుకుంటానంటూ ఆవేదన వ్యక్తం చేశాడని చెప్పుకొచ్చింది. 'మనం' సినిమాలో నటించిన నటీనటులందరికీ ఏఎన్‌ఆర్ జీవితకాలం గుర్తుండేపోయే జ్ఞాపకాలను మిగిల్చారంటూ శ్రీయ పేర్కొంది.