Advertisementt

తమన్‌కు చిరు క్లాస్‌..!

Sat 27th Jun 2015 02:15 AM
thaman,chiranjeevi,ram charan,sreenuvaitla,nayak  తమన్‌కు చిరు క్లాస్‌..!
తమన్‌కు చిరు క్లాస్‌..!
Advertisement
Ads by CJ

సంగీత దర్శకుడు తమన్‌ అంటే డప్పుల దరువుకు మారుపేరు. ఆయన పాటల్లో బీట్‌ తప్ప ఏమీ వినిపించదు.. కనిపించదు. అయితే అతని అదృష్టం బాగుండి ఆయన పాటలన్నీ ఇన్‌స్టెంట్‌గా బాగా ఎక్కుతుంటాయి. అయితే రాను రాను ఈ దరువు ఓవర్‌ అవుతోంది. అయినా దర్శకనిర్మాతలు, హీరోలు తమనే కావాలి అంటుంటారు. కాగా ఇటీవల తమన్‌ను పిలిచి మెగాస్టార్‌ చిరంజీవి క్లాస్‌ పీకాడని సమాచారం. ప్రస్తుతం రామ్‌చరణ్‌`శ్రీనువైట్ల కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి తమనే సంగీతం అందిస్తున్నాడు. దాంతో తమన్‌ను చిరు పిలిపించి ‘నాయక్‌’ను నీ చేతుల్లో పెట్టాం. కానీ నీ పని తీరు నాకు నచ్చలేదు. అందులోని రీమిక్స్‌ సాంగ్‌ను నువ్వు ఖూనీ చేశావు. మరలా నిన్ను నమ్మి నా కొడుకును నీ చేతుల్లో పెడుతున్నాను. కాస్త దరువు తగ్గించి మెలోడీి ఆల్బమ్‌ ఇవ్వు... అని చెప్పాడట. చివరకు ఈ చిత్రంలో తమన్‌ ఇచ్చిన ఆల్బమ్‌ బాగా వచ్చిందని, దాన్ని విన్న చిరు, చరణ్‌లు ఇద్దరు హ్యాపీగా ఫీలయ్యారని విశ్వసనీయ సమాచారం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ