Advertisementt

రెడీ ఫర్‌ రిలీజ్‌ అంటోన్న కమల్‌..!

Fri 26th Jun 2015 09:47 AM
kamal hassan,utthama villain,drusyam,papanasam,cheekati rajyam  రెడీ ఫర్‌ రిలీజ్‌ అంటోన్న కమల్‌..!
రెడీ ఫర్‌ రిలీజ్‌ అంటోన్న కమల్‌..!
Advertisement
Ads by CJ
గతంలో ఎప్పుడూ లేనంత బిజీగా కమల్‌హాసన్‌ ఉన్నాడు. వరుస చిత్రాలతో ఆయన నటించిన చిత్రాలు పూర్తవుతున్నాయి. కానీ ఆయా సినిమాల రిలీజ్‌ల విషయంలో మాత్రం కమల్‌ చిత్రాలు ఇబ్బందులను ఫేస్‌ చేస్తున్నాయి. ఇటీవల విడుదలైన ‘ఉత్తమవిలన్‌’ విమర్శకుల ప్రశంసలు పొందినప్పటికీ సామాన్య ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతోంది. ప్రస్తుతం కమల్‌ నటించిన మూడు చిత్రాలలో ‘విశ్వరూపం2’ చిత్రం ఎప్పుడు రిలీజ్‌ అవుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఇక మలయాళంలో మోహన్‌లాల్‌, మీనా జంటగా నటించిన ‘దృశ్యం’ చిత్రం ఇప్పటికే తెలుగు, కన్నడ భాషల్లో రీమేక్‌ అయి ఘనవిజయం సాధించాయి. ‘దృశ్యం’ ఒరిజినల్‌కు దర్శకత్వం వహించిన జీతూజోసెఫ్‌ దర్శకత్వంలోనే తమిళంలో ఈ చిత్రం ‘పాపనాశం’ టైటిల్‌తో రీమేక్‌ అవుతోంది. ఇందులో కమల్‌హాసన్‌, గౌతమి జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని జులై 3వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు కమల్‌ నటిస్తున్న ‘చీకటిరాజ్యం’ షూటింగ్‌ కూడా శరవేగంగా జరుగుతోంది. మరి ‘ఉత్తమవిలన్‌’ ఇచ్చిన షాక్‌ నుండి కమల్‌ను ‘పాపనాశం’ అయినా బయటపడవేస్తుందో లేదో చూడాలి..!
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ