హీరో నారారోహిత్ జోరు పెంచుతూ వెళ్తున్నాడు. ఆయన నటించిన ‘అసుర’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. కాగా మరో రెండు చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి. ఇటీవలే ‘అప్పట్లో ఒకడుండేవాడు’ అనే చిత్రానికి కొబ్బరికాయ కొట్టాడు. తాజాగా ఆయన మరో సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ‘ప్రేమ ఇష్క్ కాదల్’ దర్శకుడు పవన్ సాధినేని దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి ‘సావిత్రి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రం కోసం నారారోహిత్ ఎంతో కష్టపడి స్లిమ్‌గా, సిక్స్‌ప్యాక్ సాధించాడు. ఇలా మేకోవర్ చెందిన ఆయన ఈ చిత్రంపై మంచి నమ్మకాలు పెట్టుకొని ఉన్నాడు. ఈ చిత్రం జూన్27న షూటింగ్ ప్రారంభించుకోనుంది. ఈ చిత్రానికి కృష్ణచైతన్య సంభాషణలు అందిస్తుండగా, శ్రీరాజ్ సంగీతాన్ని, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నారు.