‘గోవిందుడు అందరివాడేలే, టెంపర్’ చిత్రాల తర్వాత హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కు తెలుగులో చాన్స్‌లు లేవు. దీంతో ఆమె తమిళంలోనే అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. తాజాగా ఆమెకు తెలుగులో ఓ ఆఫర్ వచ్చిందట. అది కూడా యువహీరో నాని పక్కన అని తెలుస్తోంది. 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో నటించమని కాజల్‌ను అడిగారట. ఈ చిత్రంలో హీరోయిన్‌ది చాలా కీలకమైన పాత్ర కావడంతో సీనియర్ హీరోయిన్ అయితేనే బాగుంటుందని యూనిట్ అభిప్రాయంగా తెలుస్తోంది. కానీ కొందరు మాత్రం నాని పక్కన కాజల్ అగర్వాల్ అక్కలా ఉంటుంది.. అని సెటైర్లు వేస్తున్నారు.