'ఊహలు గుసగుసలాడే' చిత్రంలో నటించి మొదటి సినిమాతోనే లవర్ బోయ్ గా క్లాస్ ఇమేజ్ సంపాదించుకున్న హీరో నాగశౌర్య. ప్రస్తుతం ఆయన నందినిరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నాడు. సినిమాలను డైరెక్ట్ చేయడంలో, టైటిల్స్ సెలెక్ట్ చేయడంలో నందినిరెడ్డి కి డిఫరెంట్ స్టైల్ ఉంది. నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా తన స్టైల్ లో ఓ లవ్ స్టొరీ ను తెరకెక్కించనుంది నందిని.
ఆమె డైరెక్ట్ చేసిన 'అలా మొదలయింది' చిత్రం తరువాత ఆ రేంజ్ లో హిట్ అందుకోలేకపోయింది. సుమారుగా రెండు సంవత్సరాల నందిని డైరెక్ట్ చేయబోయే చిత్రమిది. అయితే ఈ చిత్రానికి టైటిల్ గా 'కళ్యాణ వైభోగమే' అనే ఓ వైవిధ్యమైన పేరును ఎంచుకుంది. ఈ చిత్రంతో ఖచ్చితంగా విజయాన్ని సొంతం చేసుకోవాలని అలా మొదలైంది సినిమాకు పని చేసిన సాంకేతిక నిపుణలతోనే ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది.