రాజమౌళితో సినిమా చేయాలంటే ఏ హీరో అయినా ఎగిరి గంతేస్తాడు. కానీ అసలు సీన్ వేరే ఉంటుంది. రాజమౌళి ఏ సినిమాలో అయినా హీరోయిజాన్ని పీక్స్‌కు తీసుకెళ్లతాడు. ఈ సినిమా సూపర్‌డూపర్ హిట్టు అయిన తర్వాత ఆయా హీరోలు చేసే తదుపరి చిత్రాలు ఎంతబాగా ఉన్నప్పటికీ ప్రేక్షకులకు, అభిమానుల అంచనాలకు ఆగవు. దాంతో రాజమౌళితో సినిమా చేసే హీరోలు ఆ తర్వాత రెండు మూడు చిత్రాల పాటు ఇబ్బందులు ఎదుర్కోకతప్పడు. అలా రాజమౌళి సినిమా చేసి ఆ తర్వాత వరుసగా ఫ్లాప్స్ ఇచ్చిన హీరోల లిస్ట్ చాంతాడంత ఉంటుంది. అదే సమయంలో రాజమౌళి కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు. కిందటి చిత్రం ఎఫెక్ట్ వెంటనే తనపై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటాడు. ‘మగధీర’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఆయన ‘మర్యాదరామన్న, ఈగ’ వంటి చిత్రాలు చేయడానికి కారణం అదే. మరి ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి, ప్రభాస్‌లు తమ తదుపరి చిత్రాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారనేది వేచిచూడాల్సిన విషయం....!