Advertisementt

‘బంతి’ తెరపైకి వచ్చింది..!

Thu 25th Jun 2015 08:24 AM
sunil,trivikram,banthi,comedian role,lady oriented movie  ‘బంతి’ తెరపైకి వచ్చింది..!
‘బంతి’ తెరపైకి వచ్చింది..!
Advertisement
Ads by CJ

సినిమాల్లోకి రాకముందు నుండి టాప్‌డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కు, కమెడియన్‌ సునీల్‌లకు మంచి స్నేహబంధం ఉంది. కాగా ఎప్పటినుండో తనతో ఓ సినిమా చేయమని సునీల్‌ త్రివిక్రమ్‌ను అడుగూతూ వచ్చాడట. మొత్తానికి ఇప్పుడు ఆ కాంబినేషన్‌ సెట్‌ అయినట్లుగా కనిపిస్తోంది. త్రివిక్రమ్‌ దగ్గర ఇప్పటికే సునీల్‌ కోసం ‘బంతి’ అనే టైటిల్‌తో ఓ స్టోరీ రెడీగా ఉంది. కానీ సునీల్‌ను ఒకప్పటి కమెడియన్‌గా చూపించే తరహాలో ఆయన ‘బంతి’ స్టోరీ రెడీ చేసుకున్నాడు. కానీ ఇటీవల సునీల్‌ తన పాత బాడీని షేప్‌లు మార్చి సిక్స్‌ప్యాక్‌ సాధించి ఏవేవో ప్రయోగాలు, ఫైట్స్‌ చేస్తున్నాడు. మరి ఆ స్టోరీని సునీల్‌కు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి సినిమా తీయడానికి ఇదే సరైన సమయమని సునీల్‌తో పాటు త్రివిక్రమ్‌ కూడా భావిస్తున్నాడు. ప్రస్తుతం ఏ స్టార్‌ హీరో ఖాళీగా లేకపోవడం, త్రివిక్రమ్‌ అనుకున్న లేడీ ఓరియంటెడ్‌ చిత్రం కూడా డైలమాలో పడటంతో సునీల్‌తో సర్దుకుపోవాలనే ఆలోచనలో త్రివిక్రమ్‌ ఉన్నాడని విశ్వసనీయ సమాచారం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ