నిర్మాత, పంపిణీదారుడైన దిల్‌రాజుకు ఆమధ్య వరుసగా ఫ్లాప్స్ వచ్చి ఆర్ధికంగా బాగా ఇబ్బందులు ఫేస్ చేశాడు. తాజాగా మాత్రం ఆయన మరలా దూసుకుపోతున్నాడు. ఇటీవల వచ్చిన లారెన్స్ ‘గంగ’ చిత్రం అతనికి భారీ లాభాలను మిగిల్చింది. దీనికి తోడు ఇటీవల విడుదలైన ఆయన సొంత చిత్రం ‘కేరింత’కు బాగుందనే టాక్ వచ్చినప్పటికీ థియేటర్లు ఖాళీగా కనిపించాయి. ఎట్టకేలకు తన ప్రమోషన్ ద్వారా, మౌత్‌టాక్ ద్వారా రెండో వారం నుండి కలెక్షన్లు పికప్ అయ్యాయి. దీంతో ఈ చిత్రం అనేక సెంటర్లలో మంచి కలెక్షన్లు రాబడుతూ లాభాల పంట పండిరచే దిశగా సాగుతోంది. మొత్తానికి ఈ ఏడాది రాజుగారు ‘ పటాస్, గంగ, కేరింత’ ల ద్వారా బాగానే వెనకేసుకున్నాడు.