Advertisementt

అందరి దృష్టి ఆ రెండు చిత్రాలపైనే..!

Thu 25th Jun 2015 03:58 AM
bahubali,sreemanthudu,kick2,rudhramadevi  అందరి దృష్టి ఆ రెండు చిత్రాలపైనే..!
అందరి దృష్టి ఆ రెండు చిత్రాలపైనే..!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం అందరి చూపు ‘బాహుబలి’, ‘శ్రీమంతుడు’పైనే నిలిచి ఉన్నాయి. ఈ చిత్రాలు ఎంతటి ఘనవిజయాలను సాధించనున్నాయి? ఈ రెండిరటిలో ఏ చిత్రం రికార్డులు బద్దలు కొడుతుంది? అనే దానిపైనే చర్చ సాగుతోంది. అయితే ఈ రెండు చిత్రాల విషయంలో అందరూ ఆసక్తి చూపిస్తున్నప్పటికీ మరో రెండు చిత్రాల విషయంలో మాత్రం అందరూ అయ్యో..పాపం అంటున్నారు. అవే ‘రుద్రమదేవి, కిక్‌2’. ఈ రెండు చిత్రాలు రావాల్సిన సమయంలో వచ్చి వుంటే ఇప్పటికీ వాటి ఫలితాలతో పాటు అన్ని విషయాలు తేలిపోయి ఉండేవి. కానీ రిలీజ్‌ల విషయంలో ఈ రెండు చిత్రాలు వాయిదాలు పడుతూ రావడంతో ఇప్పుడు ఆ రెండు చిత్రాలకు రావాలన్నా  కూడా ... రాలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. దీంతో ‘బాహుబలి’, ‘శ్రీమంతుడు’లకు మధ్యలో ‘రుద్రమదేవి’ వచ్చి నలిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంటే మరోవైపు ‘కిక్‌2’ను ‘శ్రీమంతుడు’ విడుదలైన రెండు వారాల గ్యాప్‌ తీసుకుని విడుదల చేయాలని భావిస్తున్నారు. మరి ఆ రెండిరటితో పాటు ఈ రెండు చిత్రాలు కూడా ఎలాంటి ఫలితాలను చూడబోతున్నాయి... అనే విషయంపై హాట్‌హాట్‌గా చర్చసాగుతోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ