మాధవన్, కంగనారౌనత్ జంటగా ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కేవలం 31కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటివరకు 150కోట్లు వసూలు చేసింది. త్వరలోనే ఈ చిత్రం సల్మాన్‌ఖాన్ నటించిన ‘దబాంగ్2’ సాధించిన 158కోట్ల రికార్డును బద్దలుకొట్టడానికి రెడీ అవుతోంది. బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన 12వ చిత్రంగా ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ రికార్డులకు ఎక్కనుంది. కాగా ఈ చిత్రాన్ని పలు ప్రాంతీయ భాషల్లో రీమేక్ చేసేందుకు ఎందరో నిర్మాతలు పోటీ పడుతున్నారు.