>స్టార్ హీరోల సరసన తమన్నా నటించిన చిత్రాలన్నీ అపజయాలనే మూటగట్టుకున్నాయి. ఒక్క ‘రచ్చ’ మాత్రమే దానికి మినహాయింపు. అయితే ఆమె నాగచైతన్య సరసన నటించిన ‘100%లవ్, తడాఖా’ చిత్రాలు మాత్రం మంచి విజయాలు సాధించడంతో వీరిద్దరిది హిట్‌పెయిర్‌గా చెప్పుకోవచ్చు. కాగా ప్రస్తుతం నాగచైతన్య గౌతమ్‌మీనన్ చిత్రంతో యమాబిజీగా ఉన్నాడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తికాగానే హారిక-హాసిని పతాకంపై రాధాకృష్ణ నిర్మాతగా చందుమొండేటి చిత్రం మొదలుకానుంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలో కూడా తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో తనకు జోడీగా తమన్నానే కావాలని చైతూ పట్టుబడుతున్నాడట. సెంటిమెంట్‌పరంగా కూడా తనకు తమన్నా అయితేనే కలిసొస్తుందనే పట్టుదలతో చైతూ ఉన్నట్లు సమాచారం.