>కాకతీయ సామ్రాజ్యంపై సినిమా చేస్తే బాగుంటుందనుకున్నా... కానీ గుణశేఖర్ గారు ‘రుద్రమదేవి’ తీద్దామని చాలాకాలం నుంచి అనుకుంటున్నారని తెలిసింది. ఆ ఆలోచనను పక్కన పెట్టేశాను. ఆ క్రమంలోనే ముందు చెప్పిన కెరెక్టర్లతో నాన్నగారు లైన్ అల్లడం ప్రారంభించారు. దాంతో ఇక ‘బాహుబలి’ తీద్దామని నిర్ణయించుకున్నాను.. అని తెలిపాడు దర్శకుడు రాజమౌళి. అలాగే ‘బాహుబలి’ మొదలు పెట్టకముందు శ్రీకృష్ణదేవరాయులు జీవిత చరిత్రపై సినిమా తీద్దామని చాలారోజులు సిట్టింగ్ వేశాను. ఆ టైమ్‌లో ఆ కథతో రాఘవేంద్రరావుగారు బాలకృష్ణ గారితో ఈ సినిమా చేస్తారనేది బయటకొచ్చింది. రాఘవేంద్రరావుగారు నన్ను పిలిచి, నువ్వు చేయాలనుకుంటే నువ్వే చెయ్యి. నువ్వు చేయకపోతే మాత్రం నేను చేస్తాను... అన్నారు. ఆయన అనుకుంటున్నప్పుడు నేను చేయడమెందుకు అని ఆగిపోయాను అని చెప్పుకొచ్చాడు రాజమౌళి. మొత్తానికి తాను అనుకున్న రెండు చిత్రాలను బయటివారికి వదిలేయడం రాజమౌళి త్యాగంగానే చెప్పుకోవాలి.