Advertisementt

‘బాహుబలి’కి ‘పులి’ పోటీనా?

Wed 24th Jun 2015 03:29 AM
bahubali,puli,vijay,prabhas,rajamouli,bahubali vs puli,sridevi  ‘బాహుబలి’కి ‘పులి’ పోటీనా?
‘బాహుబలి’కి ‘పులి’ పోటీనా?
Advertisement
Ads by CJ
>తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘బాహుబలి’ గురించిన విశేషాలు, చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ తమిళ హీరో ఈ చిత్రానికి కౌంటర్‌ ఇవ్వడానికి సిద్దపడుతున్నాడని కోలీవుడ్‌ మీడియా అంటోంది. అతను మరెవరో కాదు... విజయ్‌ తాజా చిత్రం ‘పులి’. ఇందులో విజయ్‌తో పాటు శ్రీదేవి, సుదీప్‌, శృతిహాసన్‌, హన్సిక తదితరులు నటిస్తుండటం. ఈ చిత్రం కూడా దాదాపు 120కి పైగా కోట్లతో రూపొందుండటం. ఈ చిత్రం కూడా ఓ పౌరాణిక తరహా ఫాంటసీ చిత్రం కావడం కూడా దీనికి బలం చేకూరుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌తో పాటు తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు కూడా మంచి స్పందన వస్తుండటంతో ఇలాంటి వార్తలకు బలం చేకురుతోంది. కానీ తమిళనాట కొన్ని పత్రిలు, చానెల్స్‌తో పాటు ట్రేడ్‌ వర్గాలు మాత్రం ఈ రెండు చిత్రాలకు పోలిక అసలు లేదని, ‘బాహుబలి’కి ‘పులి’ చిత్రం ఏమాత్రం పోటీ కాదని అంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ