Advertisementt

అక్టోబర్‌లో వస్తానంటున్న విక్రం..!!

Tue 23rd Jun 2015 11:26 PM
samantha,vikram,10 endrakulla,release date  అక్టోబర్‌లో వస్తానంటున్న విక్రం..!!
అక్టోబర్‌లో వస్తానంటున్న విక్రం..!!
Advertisement
Ads by CJ

'ఐ'తో ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచిన విక్రం మరో సినిమా విడుదలకు సిద్ధమవుతున్నాడు. ప్రముఖ దర్శకుడు మురుగదాస్‌ నిర్మాణంలో సినిమాటోగ్రాఫర్‌ విజయ్‌మిల్టన్‌ దర్శకత్వంలో విక్రం ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓ రోడ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కుతున్న '10 ఎంద్రకుల్ల'లో విక్రం సరసన సమంతా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. 'ఐ' సినిమా కోసం దాదాపు రెండేళ్లపాటు ప్రేక్షకులకు దూరంగా ఉన్న విక్రం ఇక తన సినిమాల జోరు పెంచే యోచనలో ఉన్నారు.

మరోవైపు '10 ఎంద్రకుల్ల' రిలీజ్‌ డేట్‌ను కూడా ఈ సినిమా యూనిట్‌ నిర్ణయించేసినట్లుగా వార్తలు వెలువడుతున్నాయి. అక్టోబర్‌ 2న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 10 ఎంద్రకుల్ల అంటే 10 లెక్కపెట్టేలోపు అనే అర్థం  వస్తుంది. ఈ టైటిల్‌ ప్రకటించిననాటినుంచే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. మరోవైపు 'ఐ' తర్వాత వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల అంచనాలు రెట్టింపయ్యాయి. మరి '10 ఎంద్రకుల్ల'తోనైనా  విక్రం ప్రేక్షకులను అలరిస్తాడా లేదా అన్నది 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ