Advertisementt

మరలా వార్తల్లోకి వచ్చిన సుమంత్‌....!

Tue 23rd Jun 2015 12:48 AM
akkineni sumanth,vicky donor,remake,ayushmann khurrana,yami gautam  మరలా వార్తల్లోకి వచ్చిన సుమంత్‌....!
మరలా వార్తల్లోకి వచ్చిన సుమంత్‌....!
Advertisement
Ads by CJ

అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారిలో హీరో సుమంత్‌ ఒకడు. అయితే ఈమధ్య కొంతకాలంగా సుమంత్‌ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే త్వరలోనే ఆయన ఓ రీమేక్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హిందీలో సూపర్‌హిట్‌ అయిన ‘వికీడోనర్‌’చిత్రం తెలుగు రీమేక్‌లో సుమంత్‌ నటించబోతున్నట్లు సమాచారం. హిందిలో సుజీత్‌ సర్కార్‌ దర్శకత్వంలో ఆయుష్మాన్‌ఖురానా, యామిగౌతం ప్రదానపాత్రలు పోషించిన ఈ చిత్రం అక్కడ మంచి విజయం సాధించడమే కాదు... విమర్శకుల ప్రశంసలు కూడా అందుకొంది. అయితే ఈ చిత్రం హక్కులను మరో నిర్మాత చేజిక్కించుకోవడంతో వారితో సుమంత్‌ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కాగా శివనాగేశ్వరరావు దర్శకత్వంలో సుమంత్‌ నటించాల్సిన చిత్రం నుండి ఉన్నట్లుండి సుమంత్‌ను పక్కనపెట్టినట్లు సమాచారం. తనకే సినిమా ఫీల్డ్‌లో హిట్స్‌ లేనందువల్ల సుమంత్‌ స్థానంలో మరో హీరోను పెట్టుకోవడానికి శివనాగేశ్వరరావు డిసైడ్‌ అయ్యాడని సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ