Advertisementt

బాలీవుడ్‌ బాటలో ప్రభాస్‌!

Tue 23rd Jun 2015 12:44 AM
prabhas,bollywood,action jackson movie,bahubali,rajamouli  బాలీవుడ్‌ బాటలో ప్రభాస్‌!
బాలీవుడ్‌ బాటలో ప్రభాస్‌!
Advertisement
Ads by CJ

ఇప్పటివరకు దక్షిణాది హీరోయిన్లు బాలీవుడ్‌లో క్లిక్‌ అయినప్పటికీ ఒక్క సౌత్‌ హీరో కూడా బాలీవుడ్‌లో నిలదొక్కుకోలేకపోయాడు. రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, చిరంజీవి... వంటి ఎందరో స్టార్స్  అక్కడ ఆదరణకు నోచుకోక తిరుగుటపా కట్టారు. ఇక విషయానికి వస్తే... ‘బాహుబలి’ తర్వాత తన కెరీర్‌ పూర్తిస్థాయిలో మారిపోతుందని ప్రభాస్‌ భావిస్తున్నాడు. ఆ నేపథ్యంలో కొత్త ప్లానింగ్స్‌తో ప్రభాస్‌ ముందుకు వెళ్తున్నాడని అంటున్నారు. అందులో భాగంగా బాలీవుడ్‌లో ఓ చిత్రం చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తెలుగు, హిందీ భాషల్లో కలిసి వచ్చేలా హిందీ దర్శకునితో తన సొంత బేనర్‌లో బాలీవుడ్‌ చిత్రం చేయాలని ఆయన సన్నిహితులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ‘బాహుబలి’ చిత్రంతో భారీగా బాలీవుడ్‌కు వెళ్తున్నాం. ఆ క్రేజ్‌ను కంటిన్యూ అయ్యేలా ప్లాన్స్‌ ఉండాలని ప్రభాస్‌కు  రాజమౌళి సైతం సూచించినట్లు సమాచారం. దానికి తోడు ప్రభాస్‌ హిందీ చిత్రాలకు సిద్దమే అని ఇప్పటికే అంటున్నాడు. ఇటీవల వచ్చిన ‘యాక్షన్‌జాక్సన్‌’లో ఓ అతిథి పాత్రలో కనిపించి బాలీవుడ్‌కు పరిచయమయ్యాడు ప్రభాస్‌. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ