పూరీజగన్నాథ్, వరుణ్‌తేజ్ కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రానికి ‘లోఫర్’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో మరో టాపిక్ ఫిల్మ్‌సర్కిల్స్‌లో మొదలైంది. గతంలో పూరీ ‘టపోరి’ అనే టైటిల్ రిజిష్టర్ చేయించాడని, మహేష్‌తో చేసే చిత్రం కోసమే ‘టపోరి’ టైటిల్‌ను రిజిష్టర్ చేయించాడంటూ వార్తలు వచ్చాయి. ప్రస్తుతం అదే చర్చ ఫిల్మ్‌నగర్‌లో జరుగుతోంది. ఆల్‌రెడీ మహేష్ తన కథను ఓకే చేశాడని పూరీ ఇటీవల తెలిపాడు. దీంతో ఇప్పుడు ‘టపోరి’ టైటిల్‌ను మహేష్ చిత్రానికి పెడతారని ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. ‘టపోరి’ టైటిల్ మాత్రం అన్నిటా ఆసక్తికరంగా మారింది.