Advertisementt

మహేష్‌ నిజంగా శ్రీమంతుడే!

Mon 22nd Jun 2015 11:09 AM
mahesh babu,srimanthudu,bahubali,srimanthudu business  మహేష్‌ నిజంగా శ్రీమంతుడే!
మహేష్‌ నిజంగా శ్రీమంతుడే!
Advertisement
Ads by CJ
>టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుకు వరుసగా ‘1’ (నేనొక్కడినే), ‘ఆగడు’ వంటి డిజాస్టర్స్‌ రావడంతో అభిమానులతో పాటు మహేష్‌ కూడా నిరుత్సాహపడ్డాడు. ఆ ఎఫెక్ట్‌ ‘శ్రీమంతుడు’పై పడుతుందని అందరూ భావించారు. అయితే ‘బాహుబలి’తో పోటీ ఉంటుందని భయపడ్డ కొనుగోలు దారులు ఇప్పుడు సినిమా డేట్‌ను మార్చడంతో ఈ చిత్రాన్ని కొనడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్‌బాబు కూడా ఓ నిర్మాత కావడంతో మహేష్‌ నిర్మాతల చేత, దర్శకుడి చేత తక్కువ బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించడంతో సక్సెస్‌ అయ్యాడు. ఈ చిత్రానికి బడ్జెట్‌ కేవలం 35 నుండి 40కోట్ల లోపలే అని సమాచారం. ఇక థియేటికల్‌ రైట్స్‌ దాదాపు 55కోట్లకు అమ్ముడుపోయాయని, ఓ 10కోట్లు శాటిలైట్‌ రూపంలో రావడంతో ఇప్పటికే ఈ చిత్రం 65కోట్లను నిర్మాతలకు సంపాదించి పెట్టిందని సమాచారం. అంటే దాదాపు 25కోట్ల లాభంలో ఈ చిత్రం ఉండటం నిజంగా అభినందనీయం అంటున్నాయి ట్రేడ్‌వర్గాలు. బడ్జెట్‌ను కంట్రోల్‌ చేయగలిగితే స్టార్‌ హీరోల చిత్రాలు భారీ లాభాలను చవిచూడవచ్చని మరోసారి రుజువైందని ట్రేడ్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ