Advertisementt

తన శ్రీమతిదే తప్పంటున్న మంచు మనోజ్‌!

Sun 21st Jun 2015 07:53 AM
manchu manoj,pranathi,facebook,twitter,manchu manoj wife  తన శ్రీమతిదే తప్పంటున్న మంచు మనోజ్‌!
తన శ్రీమతిదే తప్పంటున్న మంచు మనోజ్‌!
Advertisement
Ads by CJ

మంచు మనోజ్‌ వివాహం ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. తన స్నేహితురాలు ప్రణతిరెడ్డిని ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లయిన తర్వాత భార్యతో ఆయనకు కొన్ని ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా అభిమానులతో సరిగ్గా ఇంటరాక్ట్‌ కాలేకపోతున్నాడు. ఈ విషయాన్ని చెప్పింది మరెవ్వరో కాదు.. స్వయాన ఆయనే. పెళ్లికి ముందు మంచు మనోజ్‌ ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ వంటి సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లలో ఎప్పుడూ అభిమానులకు అందుబాటులో ఉండేవాడు. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అందులో పోస్ట్‌ చేసేవాడు. కానీ పెళ్లయిన తర్వాత ఆయన భార్య ప్రణతి, మనోజ్‌ను అసలు ఫోన్‌ దగ్గరకు కూడా వెళ్లనివ్వడం లేదట. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండనందుకు అభిమానులకు సారీ చెబుతూ మనోజ్‌ ఓ పోస్ట్‌ చేశాడు. మరి మనోజ్‌కు కూడా భార్యాబాధితుల సంఘంలో మెంబర్‌షిప్‌ ఇచ్చేయవచ్చు అనిపిస్తోందని కొందరు సెటైర్లు వేస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ