Advertisementt

ఊరించి.. వెనక్కి తగ్గిన మంచు విష్ణు..!!

Sat 20th Jun 2015 12:23 AM
manchu vishnu,dynamite,release date,postponed  ఊరించి.. వెనక్కి తగ్గిన మంచు విష్ణు..!!
ఊరించి.. వెనక్కి తగ్గిన మంచు విష్ణు..!!
Advertisement
Ads by CJ

'డైనమైట్‌'తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి మంచు విష్ణు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే పాటలు కూడా విడుదల చేసుకున్న 'డైనమైట్‌'ను జూలై 3న విడుదల చేయనున్నట్లు ఆ సినిమా యూనిట్‌ మొదట ప్రకటించింది. అటు జూన్‌ 26న 'రుద్రమదేవి', జూలై 10న 'బాహుబలి' సినిమాల రాకను దృష్టిలో పెట్టుకొని కూడా మంచు విష్ణు ఈ డేట్‌కు కమిట్‌ కావడం సాహసమనే వ్యాఖ్యానాలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ డేట్‌నుంచి మంచు విష్ణు వెనక్కితగ్గాడు.

'డైనమైట్‌'ను జూలై 3న విడుదల చేసే అవకాశం లేదని మంచువిష్ణు స్పష్టం చేశాడు. విడుదల తేదీకి సంబంధించిన గందరగోళం తనకు తెలియకుండా జరిగిందని, 'డైనమైట్‌'ను జూలై 17న లేదా 24న విడుదల చేసే అవకాశాలున్నట్లు చెప్పాడు. ఇక తమిళంలో హిట్‌ సినిమాను రీమేక్‌గా చేస్తున్న ఈ సినిమా విజయంపై మంచు విష్ణు మంచిధీమాతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టుకు దేవకట్టా రూపంలో ప్రతిభావంతుడైన దర్శకుడు కూడా దొరకడంతో 'డైనమైట్‌' తప్పక విజయం సాధిస్తుందని మంచు ఫ్యామిలీ నమ్మకంతో ఉందంట. మరి ఈ నమ్మకం నిలబడుతుందో లేదో తెలుసుకోవాలంటే మరో నెల రోజులు వెయిట్‌ చేయక తప్పదు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ