రామ్‌గోపాల్ వర్మ నిన్న చంద్రబాబును టార్గెట్ చేయగా.. ఇప్పుడు పవన్‌కల్యాణ్‌పై ఫోకస్ పెట్టాడు. పవన్ లాంటి నిజాయితీపరులు రాజకీయాల్లోకి రావాలంటూ పలుమార్లు ప్రకటించిన వర్మ ఇప్పుడు పవన్‌కల్యాణ్‌ను టార్గెట్ చేశాడు. ప్రశ్నించే నాయకుడు లేకపోతే లోకకల్యాణం ఎలా జరుగుతుందంటూ ఇన్‌డైరెక్టర్‌గా పవన్‌ను విమర్శించాడు వర్మ.
ఓటుకు నోటు కేసుకు సంబంధించి రామ్‌గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా స్పందించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు చర్యలతో తాను ఆంధ్రుడినని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నానంటూ వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా పవన్ గురించి వర్మ స్పందిస్తూ.. 'ప్రశ్నిస్తానన్నవాడు ప్రశ్నించనప్పుడు లోకకల్యాణానికి ద్రోహం.. ఇది కల్యాణ ద్రోహం' అంటూ పవర్‌స్టార్ పేరు ప్రస్తావించకుండానే ఆర్‌జీవీ విమర్శించాడు. తాను ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానంటూ చెప్పిన పవన్ తెలుగు రాష్ట్రాల్లో ఇంత గందరగోళం కొనసాగుతున్నా.. స్పందించకపోవడంపై వర్మ ఇలా వ్యాఖ్యానాలు చేసినట్లు కనిపిస్తోంది. మరి ఇప్పటికైనా పవన్ ఓటుకు నోటు కేసుపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తే బాగుంటుందేమో..!