Advertisementt

ఇరకాటంలో మహేష్‌!

Fri 19th Jun 2015 08:27 AM
rajamouli,bahubali,srimanthudu,bajrangi bhaijaan,bahubali release date  ఇరకాటంలో మహేష్‌!
ఇరకాటంలో మహేష్‌!
Advertisement
Ads by CJ

మొత్తానికి రాజమౌళి ‘బాహుబలి’ చిత్రం జులై 10న విడుదలకు సిద్దమవుతోంది. దీంతో మహేష్‌బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రం జులై 17న కాకుండా ఆగష్టు 7వ తేదీకి పోస్ట్‌పోన్‌ అయింది. అయితే ఇప్పుడు మరో సమస్య వచ్చి చేరింది. జులై 17న సల్మాన్‌ఖాన్‌ నటించిన ‘బజరంగీ భాయిజాన్‌’ చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. దీంతో ‘బాహుబలి’ చిత్రానికి బాలీవుడ్‌లో థియేటర్ల సమస్యలతో పాటు... కేవలం వారం రోజులు మాత్రమే కలెక్షన్లు ఉంటాయని ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో రిలీజ్‌ చేస్తున్న కరణ్‌జోహార్‌ రాజమౌళిపై ఒత్తిడి తెస్తున్నాడట. ‘బాహుబలి’ చిత్రాన్ని జులై 10 న కాకుండా ‘బజరంగీ  బాయిజాన్‌’ విడుదల తర్వాత ఓ రెండు వారాల గ్యాప్‌ తీసుకొని జులై 30న ‘బాహుబలి’ని విడుదల చేయాలని కరణ్‌జోహార్‌ పట్టుపడుతున్నట్లు సమాచారం. మరి ‘బాహుబలి’ని బాలీవుడ్‌ కోసం జులై 30కి వాయిదా వేస్తే.. ఇప్పటికే మహేష్‌ నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని ఆగష్టు 7కు పోస్ట్‌పోన్‌ చేయడం వల్ల టాలీవుడ్‌లో మరలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. మరి ముందుగా జులై 10న ‘బాహుబలి’ని విడుదల చేసి, హిందీలో మాత్రం జులై 30న విడుదల చేయడం ఒక్కటే పరిష్కారంగా కనిపిస్తోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ