మహేష్‌కు సమంతకు మధ్య ఆ మధ్య ‘1’ (నేనొక్కడినే) చిత్రం సమయంలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పేడిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ తాజా సమాచారం ప్రకారం మహేష్‌బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పివిపి సంస్థ నిర్మించనున్న ‘బ్రహ్మోత్సవం’ చిత్రంలో మెయిన్ హీరోయిన్‌గా సమంత ఫిక్స్ అయిందని సమాచారం. ఇందులో మొత్తం ముగ్గురు హీరోయిన్లు నటిస్తారని తెలుస్తోంది. రెండో హీరోయిన్‌గా ప్రణీత ఓకే కాగా, మూడో హీరోయిన్ సంగతి తెలియాల్సివుంది. కాగా ఇందులో మొదట మెయిన్ హీరోయిన్‌గా రకుల్ ప్రీత్‌సింగ్‌ను అనుకున్నారు. కానీ ఆమె ఇతర హీరోల చిత్రాలతో బిజీగా ఉండి కాల్షీట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడంతో సమంతను తీసుకున్నారట. ఇప్పటికే ఆమె మహేష్‌తో ‘దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాల్లో నటించింది. రెండు చిత్రాలు మంచి విజయాలను సాధించాయి. కాగా ‘బ్రహోత్సవం’తో వారిద్దరు హ్యాట్రిక్‌కు సిద్దమవుతున్నారు. తాజాగా సమంత ట్వీట్‌చేస్తూ...ఎగ్జైటింగ్ అనౌన్స్‌మెంట్... ఇక వెయిట్ చేయడం నావల్ల కాదు’ అని ట్వీట్ చేసింది. మహేష్ సరసన ఆమెను ఖరారు చేస్తూ ప్రకటన రానున్న నేపథ్యంలో ఆమె ఇలా ట్వీట్ చేసిందని చెప్పుకుంటున్నారు.