ఏదో నటిగా తన పని తాను చేసుకుంటున్న చార్మిని పూరీ కోరి మరీ తలకెత్తుకున్నాడనే విమర్శలు వస్తున్నాయి. నితిన్ సినిమాపై, వాళ్ల ఆర్థిక పరిస్థితిపై అనవసరం వ్యాఖ్యలు చేసిన చార్మిని అలా నెత్తిన పెట్టుకోవడం పూరీ తప్పు అని అందరూ అంటున్నారు. చార్మి క్షమాపణలు చెప్పిన తర్వాత నితిన్ శాంతించినప్పటికీ ఆయన తండ్రి సుధాకర్‌రెడ్డి మాత్రం చార్మిపై పరువు నష్టం దావా వేయాలనే ఆలోచనలో ఉన్నాడట. అయితే పరిశ్రమకు చెందిన కొందరు పెద్దలు సినిమా ఇండస్ట్రీలో ఇవి సాధారణమే అని.. అలాంటి వాటిని పట్టించుకోకుండా వదిలేయమని సుధాకర్‌రెడ్డికి చెబుతున్నప్పటికీ ఆయన పట్టు విడవటం లేదని సమాచారం.