యువ సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్ సంగీతం అంటే తెలుగువారికే కాదు.. తమిళ ప్రేక్షకులకు కూడా ఎంతో అభిమానం. అందుకే ఆయన తెలుగుతోపాటు తమిళంలో కూడా స్టార్ హీరోల చిత్రాలకు సంగీతం అందిస్తుంటాడు. కాగా ప్రస్తుతం దేవిశ్రీప్రసాద్ మహేష్‌బాబు ‘శ్రీమంతుడు’ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. అదే సమయంలో ఆయన తమిళంలో విజయ్ హీరోగా రూపొందుతున్న ‘పులి’ చిత్రానికి సైతం సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం 120కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ రెండు చిత్రాల ఆడియోలు కేవలం 20రోజుల గ్యాప్‌లో విడుదలవుతుండటం విశేషం.