Advertisementt

మహేష్‌ సరసన పవన్‌ హీరోయిన్‌..!!

Thu 18th Jun 2015 10:22 PM
samantha,praneetha,bramhothasavam,maheshbabu  మహేష్‌ సరసన పవన్‌ హీరోయిన్‌..!!
మహేష్‌ సరసన పవన్‌ హీరోయిన్‌..!!
Advertisement
Ads by CJ

మహేష్‌బాబు 'శ్రీమంతుడు' షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. సినిమాను కూడా ఆగస్టు 7న విడుదల చేయడానికి చిత్రం యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్‌ 'బ్రహ్మూెత్సవం'లో నటించనున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించనున్న ఈ సినిమా షూటింగ్‌ జూలైలో ప్రారంభిస్తారని సమాచారం. ఇప్పటికే ప్రిప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం నటీనటుల ఎంపిక కొనసాగుతోంది.

'బ్రహ్మూెత్సవం'లో మొత్తం ముగ్గురు హీరోయిన్లు నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ప్రధాన కథానాయికగా ఇప్పటికే సమంతాను ఎంపిక చేయగా.. ఇక రెండో హీరోయిన్‌గా ప్రణీతను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇదివరకే ప్రణీత, సమంతాలు కలిసి రెండు సినిమాల్లో నటించారు. అందులో ఇండస్ట్రీ బ్లాక్‌బాస్టర్‌గా నిలిచిన 'అత్తారింటికి దారేది'.. ఒకటి కాగా రెండోది 'రభస' చిత్రం. ఇక 'బ్రహ్మూెత్సవం'లో కూడా ప్రణీత నటిస్తే వీరిద్దరు ముచ్చటగా మూడోసారి కలిసి నటించనట్లవుతుంది. సాధారణంగా ఒక సినిమాలో కలిసి నటించగానే ఇద్దరు హీరోయిన్ల మధ్య కచ్చితకంగా విభేదాలొస్తుంటాయి. అయితే సమంతా, ప్రణీతల మధ్య మాత్రం సినిమా సినిమాకు స్నేహం మరింత బలపడుతుండటం విశేషం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ