తెలుగునాట టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న దేవిశ్రీప్రసాద్ అటు మాస్‌ను ఇటు క్లాస్‌ను ఆకట్టుకుంటూ మ్యూజిక్ రూపొందించడంలో సిద్ధహస్తుడు. దాదాపు పదేళ్లుగా ఆయన టాప్ మ్యూజిక్ డైరెక్టర్ పొజిషన్‌లో కొనసాగుతున్నారు. వేరే భాషల సాంకేతిక నిపుణులను, నటులను అంతగా ఆదరించని కోలీవుడ్ ప్రేక్షకులు కూడా దేవిశ్రీ మ్యూజిక్‌కు బ్రహ్మరథం పట్టారు. అయితే 'సింగం-3' యూనిట్ దేవిశ్రీకి షాక్‌నిచ్చింది. ఈ సినిమాకు దేవికి మ్యూజిక్ డైరెక్టర్‌గా అవకాశం ఇవ్వలేదు.
సూర్య హీరోగా హరి డైరెక్షన్‌లో వచ్చిన సింగం, సింగం-2 సినిమాలు భారీ విజయాల్ని సాధించాయి. ఈ రెండు సినిమాలకు కూడా దేవిశ్రీప్రసాదే మ్యూజిక్ డైరెక్టర్. ఈ రెండు సినిమాల మ్యూజిక్ కూడా ప్రేక్షకుల్ని అలరించింది. అయితే సింగం-3కు మాత్రం దేవీ స్థానంలో అనిరుధ్ రవిచందర్‌కు అవకాశం ఇచ్చారు. సింగం సినిమాలకు సంబంధించి మిగిలిన సాంకేతిక బృందాలు మొదటి రెండు సినిమాలకు పనిచేసిన వారే కాగా.. ఒక్క దేవీని మాత్రం మార్చారు. అయితే సింగం-1 కంటే సింగం-2 మ్యూజిక్ ప్రేక్షకులను అలరించడంలో కాస్త వెనుకబడింది. ఈ కారణంతోనే మరి దేవీని పక్కకు పెట్టి ఉండవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.