Advertisementt

70కోట్ల ప్రాజెక్ట్‌ను పట్టించుకోని యువహీరోలు...!

Thu 18th Jun 2015 06:32 AM
gunasekhar,rudramadevi movie,young heroes,naga sourya,allari naresh,sundeep kishan   70కోట్ల ప్రాజెక్ట్‌ను పట్టించుకోని యువహీరోలు...!
70కోట్ల ప్రాజెక్ట్‌ను పట్టించుకోని యువహీరోలు...!
Advertisement
Ads by CJ

గుణశేఖర్‌ స్వీయనిర్మాణంలో అనుష్క టైటిల్‌రోల్‌ను పోషిస్తోన్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘రుద్రమదేవి’. కాగా ఈ చిత్రాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఈనెల 26న విడుదల చేయాలని లేకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుందని భావిస్తున్న గుణశేఖర్‌ అనుష్క, రానాలతోపాటు తమ చిత్రంలో అల్లుఅర్జున్‌ కూడా కీలకపాత్ర పోషిస్తుండటంతో కలెక్షన్లు కొల్లగొట్టవచ్చని భావిస్తున్నాడు. అయితే ఈ సినిమాను మన యువహీరోలు అసలు లెక్కే చేయడం లేదు. అందుకే ‘రుద్రమదేవి’ విడుదలయ్యే రోజే తమ తమ చిత్రాలను థియేటర్లలోకి తెస్తున్నారు. అల్లరినరేష్‌ తాజా చిత్రం ‘జేమ్స్‌బాండ్‌’ చిత్రంతో పాటు సందీప్‌కిషన్‌ హీరోగా నటిస్తోన్న ‘టైగర్‌’, నాగశౌర్య హీరోగా నటిస్తోన్న ‘జాదూగాడు’ చిత్రాలను అదే తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. మరి రిజల్ట్‌ ఎలా ఉండవచ్చు అనేది మాత్రం అర్థం కావడం లేదు. ఏమో.. నవ్విన నాపచేనే పండింది  అన్నట్లుగా ఓడలు బండ్లు కావచ్చు... బండ్లు ఓడలు కావచ్చు.... అని కొందరు సెటైరిక్‌ డైలాగ్‌లు విసురుతున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ