ఇటీవల రజనీకాంత్ మలయాళంలో విడుదలైన ‘భాస్కర్ ది రాస్కెల్’చిత్రాన్ని రీమేక్ చేయాలని భావించినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని వెంకటేష్ రీమేక్ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. వెంకటేష్ కెరీర్‌లో ఎక్కువ హిట్లు రీమేక్‌ల ద్వారానే వచ్చాయి. దాంతో ఆయన రీమేక్ అంటే వెంటనే ఉత్సాహం చూపించి రంగంలోకి దూకేస్తారు. ఫిల్మ్‌నగర్ సమాచారం ప్రకారం ఇటీవలే వెంకటేష్ మమ్ముట్టి, నయనతార జంటగా నటించిన ‘భాస్కర్ ది రాస్కెల్’ చిత్రం చూడటం జరిగిందని, దాంతో ఆ చిత్రం రీమేక్ చేస్తే బాగుంటుందని ఆసక్తి చూపుతున్నట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన ‘భాస్కర్ ది రాస్కెల్’ప్రశంసలతో పాటు మంచి కలెక్షన్లు కూడా సాదించింది. ఈ చిత్రం రీమేక్ రైట్స్‌ను ఇప్పటికే సురేష్‌బాబు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాని వెంకటేష్`నయనతారలతోనే తీయాలని సురేష్ భావిస్తున్నాడట.