Advertisementt

'డైనమైట్‌' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసినట్లే..!!

Wed 17th Jun 2015 02:21 PM
dynamite,manchu vishnu,release date,july  'డైనమైట్‌' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసినట్లే..!!
'డైనమైట్‌' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసినట్లే..!!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన భారీ చిత్రాలు వరుసపెట్టి రిలీజవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈనెల 26న రుద్రమదేవి, జూలై 10న బాహుబలి చిత్రాలు విడుదలవుతున్నాయి. ఆ తర్వాత మహేష్‌బాబు చిత్రం, జూలై 3న కిక్‌-2 కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న ఇతర చిత్రాలను ఎప్పుడు రిలీజ్‌ చేయాలన్న టెక్షన్‌ ఆ సినిమా యూనిట్లలో కనిపిస్తోంది. ఇక మంచు విష్ణు నటించిన 'డైనమైట్‌'ను జూలై 3న విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

తెలుగు తెరపై అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన రుద్రమదేవి, బాహుబలి చిత్రాల విడుదలకు మధ్య కేవలం రెండువారాల గ్యాప్‌ మాత్రమే ఉంది. ఈ మధ్యలోనే తన సినిమాను విడుదల చేయడానికి మంచువిష్ణు రెడీ అవుతుండటం ఆసక్తిరేపుతోంది. జూలై 3న 'డైనమైట్‌' విడుదలైన వారం రోజుల్లోనే బాహుబలి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వారం గ్యాప్‌లో తన సినిమా లాభాలను తెచ్చిపెడుతుందని మంచు విష్ణు భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఆడియో కూడా విడుదల డైనమేట్‌ సినిమాను మరింత ఆలస్యం చేస్తే నష్టాలు వస్తాయనుకుంటున్న మంచు విష్ణు ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే నెల3నే సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మరి మంచు విష్ణు అంచనాలను 'డైనమైట్‌' ఏ మేరకు నిలబెడుతుందో వేచిచూడాలి.