ఏదైనా స్టార్ హీరో చిత్రం ఫస్ట్‌లుక్ లేదా ట్రైలర్ రిలీజైన వెంటనే ఆ చిత్రం కథ ఇదిగో లేదా ఫలానా సినిమాకు కాపీ అంటూ ఏదో ఒకటి ప్రచారంలోకి వచ్చేస్తోంది. తాజాగా కమల్‌హాసన్ హీరోగా రాజేష్ ఎమ్. సెల్వ దర్వకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘చీకటిరాజ్యం’. ఇందులో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌ను ఆ మధ్య విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ‘స్లీప్‌లెస్ నైట్’ (2011)అనే ఫ్రెంచ్ చిత్రం ఆధారంగా రూపొందుతోందని చెన్నై ఫిల్మ్ సర్కిల్స్‌లో వినపడుతోంది. గతంలోనూ కమల్ చిత్రాలు రకరకాల పరభాషా చిత్రాల నుండి ప్రేరణ పొందినవి కావడంతో ఇదీ నిజమే కావచ్చునని పలువురు భావిస్తున్నారు.